త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ…
హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? అధికార TRSని ఢీకొట్టడం సాధ్యమా..? ఈటలను కాదని కాంగ్రెస్ పైచెయ్యి సాధించడం ఈజీయేనా? కొండా… కాంగ్రెస్‌కి కొండంత అండ ఇవ్వగలరా? కొండా సురేఖ అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓటు చెదిరిపోదని లెక్కలు..! హుజురాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కి సవాల్. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తక్కువ. గెలవలేనప్పుడు గౌరవప్రదమైన ఓటు బ్యాంకైనా సాధించి తీరాలి. పైగా టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌తోపాటు…
తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక, దసరా కంటే ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దసరాను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. బతుకమ్మల సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోంది.. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం…
అన్ని అనుకూలిస్తే ఆ నేత హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేవాడు. కానీ అతడి వ్యూహం బెడిసి కొట్టడంతో ఆ సీటు చివరి నిమిషంలో దూరమైంది. దీంతో ఆ నేతకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సదరు నేతకు శాసన మండలిలో అడుగు పెడుతారని అంతా భావించారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే ఆ నేత ఎవరో ఓ క్లారిటీ వచ్చేసింది…
కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ రోడ్డెక్కాయి విపక్ష పార్టీలు. భారతబంద్ పాటించాయి. ఈ విపక్షపార్టీల బృందానికి దూరంగా ఉండిపోయింది అధికారపార్టీ టీఆర్ఎస్. బంద్‌కు దూరం వ్యూహాత్మకమా? ఇంకేదైనా బంధాలకు బాట పడుతోందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భారతబంద్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్‌పై చర్చ..! పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత్ బంద్ పాటించాయి కాంగ్రెస్, వామపక్షపార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కొన్ని…
ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ…
హుజూరాబాద్ సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా…
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యం లో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.…
బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఇది సన్నాసి…
తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు…