హుజురాబాద్ ఉప ఎన్నికల సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. అలాగే ఈటెల రాజేందర్‌కు కూడా ఇది అగ్నిపరీక్ష. దాంతో ఇక్కడ ఎవరు జెండా ఎగరేస్తారన్నది ఆసక్తిగా మారింది. గులాబీదళం.. కమలదళం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాన్ని నిధులతో ముంచెత్తుతోంది. కోట్ల వ్యయంతో దళితబంధు ప్రోగ్రామ్ తెచ్చింది. అలా దళిత ఓటర్లకు దగ్గరవుతుంది. అందులో అనుమానం లేదు. ఇక ఈటెల బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టి..టీఆర్‌ఎస్ కూడా యాదవ కులస్తుడు గెల్లు…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
సీఎం కేసీఆర్‌తోపాటు హస్తిన వెళ్లిన ఎమ్మెల్యేలు సంబరాల్లో ఉన్నారా? కీలక పదవులు దక్కుతాయని ఎమ్మెల్యేల అనుచరులు గాలిలో తేలిపోతున్నారా? ఇంతకీ ఢిల్లీలో జరిగిన చర్చలేంటి? నియోజకవర్గాల్లో నెలకొన్న హడావిడి ఏంటి? ఎవరా ఎమ్మెల్యేలు? లెట్స్ వాచ్..! జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలపై చర్చ..! ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం సంబరాల రాంబాబుల గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతోపాటు.. వారి అనుచరులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారట. మన టైమ్ వచ్చిందని.. ఇక పిలుపు రావడమే మిగిలిందని…
హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తుల విలువ 2 లక్షల 82 వేలు కాగా, స్థిరాస్తుల విలువ 20 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన 4 లక్షల 98 వేలు. హుజూరాబాద్ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ…
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమవడానికి కారణమనే వాదనలున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నేతల వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ‘కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు.. కాంగ్రెస్ వాదులు తప్ప’ అన్న నానుడిని తెలంగాణ నేతలు అక్షరాల నిజం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు…
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని…
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్‌ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్‌ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…
గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్‌తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది. అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది.…