తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కురుక్షేత్రాన్ని తలపించేలా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంపై స్థానిక ఓటర్లు మాత్రం పెదవి విరుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట… హుజూరాబాద్…
తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఇక నిన్న హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. తాజాగా ఈ ఉప ఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉండగా… ఆఖరి రోజున రాజేందర్ పేరుతో…
ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్. ఇంతకీ ఏంటా పంచాయితీ? ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..! కాలేరు వెంకటేష్. హైదరాబాద్ సిటీలో అంబర్‌పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్‌కు…
దేశ చరిత్రలో హుజురాబాద్ ఎపిసోడ్ చీకటి అధ్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ఎపిసోడ్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. అడ్డదారుల్లో ప్రలోభాలతో మద్యం, డబ్బుతో గెలవాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించిన ఈటల రాజేందర్.. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొనుగోలు చేసే దారుణం జరుగుతోందని ఆవేదన వ్యక్తం…
ఎన్నికలంటే సహజంగానే ప్రచారం హోరెత్తెత్తుంది. ఇంటింటికి తిరిగి ఓటడుగుతారు. హామీల వర్షం కురిపిస్తారు. ఒటర్లను ఆకట్టుకుంటారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు రసకందామంలో పడింది. అభ్యర్థులే కాదు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. డబ్బులు కూడా గట్టిగానే ముట్టచెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎప్పుడో కానీ ఇలాంటి ఎన్నికలను మనం చూడలేం అంటున్నారు…
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొలివారం…
త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లపై మాట్లాడుతూ… డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం…
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా… గురువారం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు…