ఆ జిల్లాలో ఉన్నది మూడే నియోజకవర్గాలు. మూడింటికి మూడు కీలక సెగ్మెంట్లే. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్రధానపార్టీలు గేర్ మార్చడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా నాదా.. నీదా అన్నట్టు కార్యక్రమాలు జోరు పెంచారు నాయకులు. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ రాజకీయ ప్రత్యేకత ఏంటి? ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో అంతుబట్టదు..! నారాయణపేట జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజన తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. అవే…
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి? తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు……
భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు. అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ను ఎదురుకునే సత్తాలేక బీజేపీ… కాంగ్రెస్ ను కలుపుకుందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పై ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని… ఢిల్లీలో శత్రువులు- రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్…
ఈ నెల 29 వ తేదీన వరంగల్ జిల్లాలో విజయ గర్జన సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్ భావించింది. ఇందులో భాగంగానే ఇవాళ హన్మకొండలోని దేవన్నపేటలో ఈ సభకోసం స్థలం పరిశీలించారు టీఆర్‌ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు మరియు అక్కడి రైతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్ మరియు రైతుల మధ్య…
హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో స్పందించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకతో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని, హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణవాదులు, ఉద్యమకారులు గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులు ఓడారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ లో ఓటమి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిది కాదు.. సీఎం కేసీఆర్‌ది అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవిస్తేనే…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.. హుజురాబాద్ ప్రజలతో పాటు.. తెలంగాణ మొత్తం ఆ ఫలితాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.. ఇక, 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఆధిక్యాన్ని సాధించారు.. 11వ రౌండ్…
హుజురాబాద్ ఈటల రాజేందర్ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్ ఓటర్ల ముందు…
ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆధిక్యం వచ్చినా.. తిరిగి తొమ్మిదో రౌండ్ నుంచి ఈటల తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పదో రౌండ్‌లో కూడా ఈటల…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్‌ఎస్ పార్టీ ఊహించని షాక్ తగులుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ పార్టీనే లీడ్ లో ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ దళిత బంధ, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టిన శాలపల్లి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. శాలపల్లి తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం లోకి వచ్చారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్…