వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అధికారులతో చర్చించారు. ఏయే జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో 1033 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.
అవసరమైన చోట నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గన్నీ సంచుల కొరత లేదని, కొనుగోలు కేంద్రాల్లో గన్నీలు, వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలినన్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ధాన్యం రవాణా చేసేందుకు ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. పౌరసరఫరాల అంశాలను పర్యవేక్షించేందుకు ఐటీ విభాగాన్ని బలోపేతం చేస్తామమన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు.