సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే.. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్ రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ? అంటూ ప్రశ్నించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి MLAగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై తానే పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్నారు. కానీ.. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య కుదిరిన దోస్తీ.. పొత్తుల దిశగా అడుగులు వేస్తుండటంతో సీన్ మారిపోతోందన్నది తాజా టాక్. పొత్తు పొడుపుల్లో కుదిరే సర్దుబాటుల్లో పాలేరు చేరుతుందని.. ఆ…
టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్ వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్‌గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్ రాడార్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..…
MLA Purchasing Case: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
MP Santhosh: నవ మాసాలు కని పెంచిన తల్లిని, పుట్టిన ఊరును మరవద్దంటారు పెద్దలు. తల్లి, ఊరు కోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. అందులో ఒకరు జన్మనిస్తే.. మరొకటి జీవితాన్ని ప్రసాదించింది.
కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ.