TRS MLA Balka Suman: సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు. మోడీ పర్యటనతో ఒరిగింది ఏమి లేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో ఎన్నికలు ఉన్నందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆరోపించారు. గడియారాలు తయారు చేసే కంపెనీకి బిర్జ్ పనులు అప్పచెప్పి వందల మంది చావులకు మోడీ కరమయ్యారని ఆరోపించారు.
Read also: Special Focus On Cardiac Arrests Live: జిమ్ లు ప్రాణాలు తీస్తున్నాయా?
బీజేపీ ప్రభుత్వం వందల కోట్ల అవినీతి పాల్పడుతోందని మండిపడ్డారు. లాభాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మీ మిత్రులు అదాని-అంబానిలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సభలో మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను ప్రవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ బడా ఝాటా పార్టీ అని, తెలంగాణ లోని ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన జీఎస్‌టి డబ్బులు ఇవ్వకుండ మోడీ ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసింది మీరు కదా? అంటూ మండిపడ్డారు బాల్కసుమన్.
Ponnam Prabhakar: ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లుంది..