MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Purchasing Case: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అర్హత లేదని కోర్టుకు తెలిపారు. వెంటనే ముగ్గురికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి వంద కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం(సిట్) విచారణకు రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఇవ్వాళ్టితో వీరి కస్టడీ ముగియగా.. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ముగ్గురు నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించినట్టు తెలుస్తోంది. బేరసారాల వీడియోలో వాయిస్ ను, తాజాగా సేకరించిన వాయిస్ తో పోల్చిచూడనున్నారు. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా విచారించారు. అనంతరం, ముగ్గురిని కలిపి ఒకేసారి విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించిన సమయంలో ముగ్గురు వేర్వేరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?