మొన్నటి దాకా దాదాపు కొన్ని నెలలుగా హుజురాబాద్ ఎలక్షన్‌తో బీజీ బీజీగా ఉన్న హరీష్ రావు శుక్రవారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.12 గంటలు 12 కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణు ల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ప్రజల మధ్య…ఇటు ప్రగతి కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు మంత్రి హరీష్. ” నాయకుడు అనే పదానికి కొత్త అర్థం చెప్పడంలో మంత్రి హరీష్…
కేబినెట్ సబ్ కమిటీకి భూముల వివరాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 166 కింద వచ్చిన అప్లికేషన్స్, జీవో నెంబర్ 58 ,59 కింద వచ్చిన దరఖాస్తులు , అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ వక్ఫ్ భూములు, కోర్టు కేసులో ఉన్న భూముల వివరాలను సమర్పించాలని పేర్కొంది. దీంతోపాటు ఆ భూముల విలువ ఎంత అనే వివరాలను కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.హౌస్ సైట్స్ కోసం…
సిద్ధిపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో , గ్లోబల్ సైన్స్ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు, జిల్లాలోని, 100 పాఠశాలలకు, సైంటిఫిక్, మూవింగ్, గ్లోబులతో పాటు ఇతర పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధి పేట పట్టణాన్ని, విద్యానిలయం గా తీర్చిదిద్దా మన్నారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఏ జిల్లాలో సీటు వచ్చినా, సిద్ధిపేటలో సీటు రావా లి అన్నది వాళ్ళ కోరికగా ఉండటం తల్లిదండ్రులు…
తెలంగాణలోని హుజురాబాద్ బైపోల్ మినీయుద్ధాన్నే తలపించింది. ఈ హోరాహోరి పోరులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నెల రెండున హుజురాబాద్ ఫలితం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఈ ఎన్నికకు అసలు ప్రాధాన్యతే లేదని వ్యాఖ్యనించారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్‌ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజురాబాద్ ఫలితాన్ని రెఫరెండంగా భావించడం లేదన్నారు. ఈ 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ ఎన్నో గెలుపు ఓటములను చూసిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ…
సిద్ధిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకమిటీల నిర్వహణ, బహిరంగ సభ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తన పిలుపుతో స్వచ్ఛం దంగా యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సి లర్స్, టీఆర్‌ఎస్ కార్యకర్తలను అభినందించారు. యాదాద్రి ఆలయ బంగారు గోపుర నిర్మాణానికి సిద్ధిపేట నుంచి కిలో బంగారం ఇస్తామని అక్కడి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రకటించారన్నారు. లక్ష్మీ నర సింహ స్వామికి 37 తులాల బంగారం సిద్ధిపేట…
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి…
ఉన్నవి ఆరు పదవులు…ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ…ఆ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుంది ? ఎవరికి ఏ అంశం కలసి వస్తుంది ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయ్యింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలు…అధికార పార్టీకే దక్కుతాయి. దీనితో టిఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు,…
దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెట్రో ల్, డీజిల్ ధరల పెరుగుదలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పాటించడానికి బలముండాలన్నారు. పెట్రోల్‌పై రూ.41 పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10 తగ్గించాలని…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తరువాత ఈటల రాజేందర్ మొదటి సారిగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో సిద్ధిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలో ఆగారు. అక్కడ ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హరీశ్‌రావు వచ్చి సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తానంటూ ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కానీ.. హుజురాబాద్ ప్రజలు హరీశ్‌రావుకి తగిన బుద్ది చెప్పారని…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే.. కేంద్ర ప్రభుత్వం…