రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు. తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు…
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీజేపీ నిరసనలు చేపడుతందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని పన్నులు తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
తెలంగాణలోని వరి రైతులు షాక్ ఇస్తూ తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి…
సిద్ధిపేట పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తాగునీటి జలవలయాన్ని చేపడుతున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తాగునీటి ఎత్తిపోతలకు దీంతో ఇబ్బందులు తప్పుతాయన్నారు. నాలుగు దశాబ్దాల ముందు చూపుతో..మున్సిపల్ శాఖ శాశ్వత తాగునీటి అభివృద్ధి కో సం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. సిద్ధిపేట రింగ్ మేన్ పైపులైన్ గ్రావిటీ ద్వారా పట్టణంలోని ప్రతీ కాలనీకి నీటిని తరలించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీకి రింగ్ మేన్ కనెక్టీవిటీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా… పోడు భూముల పై అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రమేష్ బాబు,రసమయి బాల కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ వుల ను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరి సిల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందన్నారు. దీన్లో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు…
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ…
హుజురాబాద్ ఎన్నికల ముందు టిఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి అదృష్టం పట్టిందనుకున్నారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడింది. హుజురాబాద్‌లో ఓటమితో టియ్యారెస్ అధిష్టానం మరో కొత్త ప్లాన్ వేసింది. ఏమిటా ప్లాన్ ? అది అమలయ్యేదెప్పుడు?గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అనూహ్యంగా అధికార టిఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈటల రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో తనకు టికెట్…
తెలంగాణ బీజేపీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. టీబీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించండి అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రైతులను ఆందోళనకు గురి చేయడం అలవాటే అంటూ ఎర్రబెల్లి విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్ ఫలితం తర్వాత జరుగుతున్న చర్చలేంటి? హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది.టిఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో హుజురాబాద్ ఫలితంపై టిఆర్ఎస్ లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఓటమికి కారణాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం…
అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చేదుఅనుభవం ఎదురైంది.. తమ గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందులకు గురిఅవుతున్నామంటూ ఆందోళనకు దిగిన స్థానికులు.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు.. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు.. గత 25 సంవత్సరాలుగా రోడ్డు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు.. ఎమ్మెల్యే రాజీనామా…