Home
Trs
Trs News
-
ఢిల్లీలోనే మంత్రుల బృందం
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.… -
ఇక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారు : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు. గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే… -
బిగ్ న్యూస్: త్వరలోనే దళితబంధు నిధులు విడుదల : కేసీఆర్
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు… -
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస..నిరసనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెలకొంది. దీంతో నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి.… -
నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన : కేసీఆర్
నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు. వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి… -
దేవుని పేరు చెప్పి.. బీజేపీ రాజకీయం చేస్తుంది : జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక… -
తిరిగి కాంగ్రెస్ గూటికి డీఎస్ రాక వెనక బలమైన లెక్కలు..?
ఊహాగానాలకు తెరదించారు ఆ సీనియర్ పొలిటీషియన్. మళ్లీ పాత గూటికే వెళ్తున్నారు. రీఎంట్రీ వెనక కీలక లెక్కలే ఉన్నాయట. భారీ అంచనాలు వేసుకుని.. పైవాళ్ల దగ్గర ఓ మాట అనేసుకుని.. జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వేసుకున్న లెక్కలేంటి? కాంగ్రెస్‌లోకి తిరిగి ఎందుకొస్తున్నారు? ధర్మపురి శ్రీనివాస్. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ… -
కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడు : బండి సంజయ్
కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు… -
కేటీఆర్‌తో దోస్తీ.. మంత్రి హరీష్‌రావుతో జగ్గారెడ్డి కుస్తీ?
ఆ మంత్రికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అదేజిల్లాకు చెందిన మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు.. జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎవరా కాంగ్రెస్ ఎమ్మెల్యే? ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వైరమైనా.. స్నేహమైనా హాట్ టాపిక్కే. అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో… -
ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోంది: గండ్ర వెంకటరమణా రెడ్డి
ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. Read Also: సోషల్‌మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్ ధాన్యం తీసుకోకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై నెపం నెట్టివేయాలని కేంద్రం చూస్తోందని ఆయన…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!