తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్ఎస్…
కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ మియాపూర్‌లో కల్వరి టెంపుల్ హాస్పిటల్‌ను ప్రారంభించారు కవిత. కోవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్య శాఖ..శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చిందని చెప్పారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. రైతుల పాలిట కేసీఆర్…
చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో..…
మేడమ్ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. మేయర్‌పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..! గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ..…
అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం? గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..! నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్.…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.…
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు. గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెలకొంది. దీంతో నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి.…