తీన్మార్ మల్లన్న వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్నను ఉరికించి కొట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆయన జర్నలిస్ట్ కాదు…బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడని మండిపడ్డారు. మంత్రి కెటిఆర్ కుమారుడి గురించి ఇష్టారాజ్యాంగ మాట్లాడుతాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ ఫ్యామిలీ మీద మరొక్కసారి మాట్లాడితే మా గులాబీ సైన్యం బట్టలూడదీసి కొడతుందని హెచ్చరించారు. మా నేత కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా అభిమానులు ఊరుకుంటారా అని…
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఇవాళ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని గ్రహించుకోవాలని.. ఇక నీ కాలం చెల్లదు గుర్తుంచుకో అంటూ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బిజెపి అండగా ఉంటుందని… ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.…
తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? వడపోతల్లోకి వచ్చి పోతున్న నాయకులు ఎవరు? సీఎం కేసీఆర్ వేస్తున్న సామాజిక లెక్కలేంటి? ఒక్క బెర్త్ భర్తీకి వడపోతలు మొదలయ్యాయా? అధికార టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం పదవుల భర్తీ జాతర నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల సందడి పూర్తి కాగానే.. పలు దఫాలుగా నామినేటెడ్ పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు చాలానే ఉన్నాయి. వాటి కోసం…
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు…
తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు. భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు…
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని…
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా…
తెలంగాణ రైతుల హక్కులను టీఆర్ ఎస్ ప్రభుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. రైతుల చావులకు, వడ్లు కొనక పోవడాని బీజేపీనే కారణం అని ఢిల్లీ పోయారని……
కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.బీజేపకీ ప్రభుత్వం లక్ష్యాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని మంవడిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎంపీలు , మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీ తో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వారి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము…