కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు…
హైదరాబాద్ హైటెక్స్ లో స్కూల్ లీడర్‌షిప్ సమ్మిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ను మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీగా ఉన్నప్పుడు నాటి మంత్రి స్మృతి ఇరానీ గారితో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించాం.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఎడ్యుకేషన్ పాలసీ గురించి మా సూచనలు తెలియజేసాం.. కొన్ని రాష్ట్రాలలో మాతృ భాషలో పరీక్షల నిర్వహన గురించి కొన్ని సమస్యలు…
అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారం రోజుల…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం…
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్‌లో ఓ పోల్ క్వశ్చన్‌ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు.…
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న చేసిన పని… దుర్మార్గమని విమర్శించారు. చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అల్లం నారాయణ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు…
కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని..అందుకే చిల్లర రాజకీయాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పాలన స్తంభించిందని.. రాజకీయమే పరమావధిగా టీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి టీఆర్ ఎస్ ప్రభుత్వం దిగజారిందని నిప్పులు చెరిగారు.…
తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖరీఫ్…
తీన్మార్ మల్లన్న కేటీఆర్ కొడుకు హిమాన్షుపై అనుచిత పోల్ నిర్వహించడంపై టీఆర్‌ఎస్ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ..మల్లన్నను హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా ఇప్పటికే కేటీఆర్ మల్లన్న పై కేసు కూడ నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసిన విషయం తెల్సిందే.. అయితే ఈ అంశంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందిస్తూ కొందరు బుద్ధి లేకుండా చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, తాము ప్రభుత్వంలో ఉన్నాం…
మిషన్ 70. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ముందున్న టార్గెట్. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కమలనాథులు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. ఇంఛార్జుల వేటలో పడినట్టు చెబుతున్నారు. బీజేపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారా? తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. బీజేపీ బలం ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో రెండు ఉపఎన్నికల్లో గెలిచినవే. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన స్థానాలు ఎక్కువే. అయితే ఉప ఎన్నికల్లో గెలిచామన్న ధీమానో…