కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల పై గత రెండు రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణపై స్థల యజమానుల్లో ఒకరైన Yupp tv CEO ఉదయానందన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జాతర స్థలం పూర్తిగా మా కుటుంబ సభ్యులదేనని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థలంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి…
జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో పనిచేస్తేనే తెలంగాణలో ఇదంతా సాధ్యమయ్యిందని ఆయన అన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణలో కరెంట్ పోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నిరసనలపై బీజేపీ నేత స్పందిస్తూ ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించినప్పుడు చంద్రశేఖర్ రావు సభలో లేరని అన్నారు. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలు అబద్ధమని వినోద్ కుమార్ అభివర్ణిస్తూ.. వాస్తవాలు తెలుసుకోకుండా సంజయ్ కుమార్ నిరాధారమైన…
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గుజరాత్‌లోని నర్మదా వ్యాలీలో ఉన్న ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధ్యయనం చేశారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, లేజర్ షో తదితర సౌకర్యాలను మంత్రి తనతోపాటు వచ్చిన సీనియర్ అధికారులతో కలిసి…
హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ బుక్‌లెట్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని, సీఆర్ఎంపీ కింద…
రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లో గవర్నర్‌ను సీఎం బ్లాక్ చేసే…
ప్రధాని మోడీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెనుదుమారం రేపుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు పట్టిన శనిగ్రహం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రూపంలో తెలంగాణను వెంటాడుతున్న భూతం అంటూ విమర్శించారు. కేసీఆర్ పథకాలతో ప్రధాని మోడీ వణికిపోతున్నారని, అందుకే పురిటీలోనే అణిచివేతకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిలువరించాల్సిన బాధ్యత యావత్ ప్రజానీకంపై ఉందని, అందుకు గులాబీ శ్రేణులు…
కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్గొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొని, ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను…
మోడీ తెలంగాణ ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాల పై మోడీ రాజ్య సభలో మాట్లాడారని, టీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తుందని, అది జరగదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిందని, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై భౌతిక…
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన…