దక్షణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఇక, ఉత్తరాది వారి పెత్తనం దక్షిణాదిపై ఎక్కువగా ఉందని.. అసలు వారి పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా… ఆర్థికాభివృద్ధి, జనాభా నియంత్రణలో దక్షణాది రాష్ట్రాలు ఉంటే.. కేవలం జనాభా పెంచడంపైనా ఉత్తరాధి రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయని విమర్శించారు.. ఏపీ పునర్:వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు పడ్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి…
ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వార్ నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతుండగా దానికి కౌంటర్‌గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ట్వీట్‌పై ఉదయం కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో.. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ట్విట్టర్లోనే కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.…
తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు…
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్యబట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిపడ్డ ఈటల.. ఈరోజు దుఃఖం…
బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయన్న ఆయన.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేదన్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2022…
డబ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడినట్టుగా.. బతుకు బండిని నడేపేది పచ్చనోటే.. డబ్బును బట్టి మనిషికి స్టేటస్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోకలు కూడా వచ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులపై హాట్ కామెంట్సల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం…
సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాల పై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత లేదని, మోడీ ఆరోజే రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన హామీలు ఎటు పోయాయి, ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమని,…
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు.…
కేసీఆర్ వాఖ్యల పై బీజేపీ నాయకులు చిల్లర మల్లారా మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో…
సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై నిన్న బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్…