రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.91 కోట్ల విలువైన మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను ప్రారంభించింది. ఇందులో 1,000 మందికి పైగా రోగులకు వసతి కల్పించడానికి అత్యాధునిక ఔట్ పేషెంట్ బ్లాక్, రూ. 50 లక్షలతో డయాలసిస్ సౌకర్యం మరియు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. 60 లక్షల విలువైన మార్చురీ సౌకర్యం కల్పించనున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో కొత్త ఔట్ పేషెంట్ బ్లాక్‌కు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని…
హైదరాబాద్‌లోని రైల్వే క్రాసింగ్‌లపై చేపట్టే పనులకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నగరంలోని పలు రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీలు (రూబీలు), రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశంలో రైల్వే శాఖతో కలిసి పని చేయాలని కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్),…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్లు వేయాలని, నాలాలను అభివృద్ధి చేయాలని, పట్టాలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించాలని భావిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రోడ్లు మూసేయడం దురదృష్టకరం. మరియు స్కైవేలు మరియు రోడ్ల విస్తరణ కోసం భూమిని కేటాయించలేదు.”అని…
ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపైనుంచి కనుమరుగయ్యారు ఆ మాజీ మంత్రి. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియడం లేదట. ఉన్నచోటే అవమానాలను భరించాలా? లేక పాతచోటుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు ఆ మాజీ మంత్రి. పొలిటికల్ జంక్షన్‌లో నిలుచుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? కొల్లాపూర్‌లో జూపల్లి ఉనికి ప్రమాదంలో పడిందా?జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇదే సమయంలో.. రాహుల్ విషయాన్ని ప్రస్తావించారు.. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అయినా.. ఓ విషయం నన్ను బాధించింది.. ఆయన ఎంపీగా ఉన్నారు…
ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా…
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న…
నేడు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏడేళ్ల నుండి కేంద్రంతో ఏమైనా పంచాయితీ పెట్టుకున్నమా, నోరు కట్టుకొని పని చేసి ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయని ప్రాధాన్యత పెరిగిందని, హైదరాబాద్‌కి వెళ్లిన వాళ్ళు గ్రామాలకు మళ్ళీ వస్తున్నారని, వ్యవసాయం ప్రాధాన్య పెరిగింది భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రెండేళ్ల నుండి నరేంద్రమోదీ పంచాయితీ మొదలు పెట్టిండని, 2 ఏళ్ల…
ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత?…
జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ…