రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14 తేదీన జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నామన్నారు. సుమారు 311 కిలో…
బీజేపీ పార్టీనీ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు విజయశాంతి… నిజామాబాద్ జిల్లా భోధన్ లో జరిగిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ మీద కోపంతో, బీజేపీ పార్టీపై భయంతో రైతులను కేంద్రంపైకి కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. రైతులు సంయమనంతో ఆలోచించాలని… బీజేపీ ద్వారా మాత్రమే రైతులకు మేలు, న్యాయం జరుగుతుందిని విజయశాంతి అన్నారు. వరి…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భారీగా కాంగ్రెస్ శ్రేణుల తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని, యాదాద్రి ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదని, మౌలిక సదుపాయాలు లేకున్నా ఆలయాన్ని…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆడుకుంటున్నాయని, ఏపీ, కర్ణాటకలో లేని సమస్య తెలంగాణలోని ఎందుకు ఉందని ఆయన మండిపడ్డారు. నేనే ధాన్యం కొంటా అన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఏమి చేయడం లేదని, రూ.1900 మద్దతు ధర దక్కాల్సిన రైతులకు 1300 దక్కుతుందన్నారు. మిల్లర్ లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని, తెలంగాణలో ధాన్యం…
టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతోందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కయ్యారని, భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ అని, రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్, అన్నదాతాలారా…. కేసీఆర్ కుట్రలను చేదిధ్దాం రండి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక…
మహబూబ్ నగర్ జిల్లాలో కిసాన్ మోర్చా నిర్వహించిన రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసింది. ప్రజలు టీఆర్ఎస్‌ను శిక్షించి నన్ను గెలిపించారని, 101వ తప్పుకు కూడా ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా…
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని…
తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు..…
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్‌లో టీఆర్‌ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు..…