తెలంగాణలో వేసవి తాపం పెరుగుతోంది. దాంతో పాటే రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్‌ఆర్‌టిపి వంటి అన్ని విపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పాదయాత్రలు, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఐతే, గత రెండు మూడేళ్లుగా తెలంగాణలో బీజేపీ తన ఉనికిని గట్టిగా…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి పీకే పర్యటించారు.. అయితే, ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అయితే, మీ (టీఆర్ఎస్ పార్టీ) ఓటమిని ఎవరూ ఆపలేరని పీకేనే చెప్పాడట అని వ్యాఖ్యానించారు. ఇక, రైతులతో చెలగాటం ఆటలాడితే మాడి…
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు.. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పైసా సంపద తెలంగాణ ప్రజలదేనన్న ఆమె.. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు పెట్టారంటూ ఆరోపించారు.. Read Also:…
సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని,…
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ మాట్లాడుతూ.. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందని ఆయన మండిపడ్డారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి…
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి…
తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని.. తన విషయంలో ఏం జరుగుతోందో మీడియాకు, ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను గౌరవించకున్నా.. కనీసం రాజ్‌భవన్‌ను గౌరవించాల్సి బాధత్య ఉందని ఆమె అన్నారు. అంతేకాకుండా సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీకి చెందినా ఇప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నానని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమి…
తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తూనే ఉంది.. వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిందంటూ మరోసారి.. బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. 2021-22లో తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించలేదంటూ ఓ నివేదికను ట్విట్టర్‌లో షేర్ చేశారు.. 2020లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ…
రాస్తారోకోలు, ధర్నాలు కొత్త కాదు.. ఈ మధ్య.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో పోటీపోటీ ఆందోళను నడుస్తున్నాయి.. అయితే, కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణలో నేడు చేపట్టిన, రేపు చేపట్టబోతున్న టీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నాలపై హైకోర్టులో విచారణ జరిగింది… అనుమతి లేకుండా టీఆర్ఎస్ ఆందోళన చేస్తోందంటూ కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ పిటిషన్ దాఖలైంది.. దానిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. ధర్నాలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందని పిటిషన్ పేర్కొన్నారు……