ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి గుది బండగా మారిన పెట్రో ధరలపై గురు పెట్టారు.. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బహిరంగలేఖ రాశారు.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే…
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు..…
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు…
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. అయితే నేడు గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలో 129 మందికి దళిత బంధు లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు మంజూరు పత్రాలు, యూనిట్‌లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం క్రింద ఒక్కొ లబ్దిదారుడికి రూ.10 లక్షలు అందజేసిన ఘటన సీఎం కేసీఆర్‌కే దక్కుంతుందని ఆయన కొనియాడారు. అంతేకాకుండా దళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్నారు. పార్టీలకు అతీతంగా…
తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ. సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట…
ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ పబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలతో సహా 148 మంది యువతి, యవకులు పట్టుబడ్డారు. అయితే ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల సన్నిహితులే ఈ ఘటనలో ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రేవంత్…
ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొన లేదు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుపాలంటూ టీఆర్ ఎస నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణ బీజేపీ నేతలేమో కేంద్రం ధాన్యం కొంటామన్నా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ లో ఏవిధంగానైతే ధాన్యం కొంటున్నారో.. అదే విధంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో మేము ప్రజలము కాదా?…
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. Read Also: Minister KTR : కిషన్…
ధాన్యం కోనుగోళ్ల విషయమై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరింది. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మానసిక…