మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం…
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్..…
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…
వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి…
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేయాల్సి రావడం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్… వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కార్.. హస్తిన వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు..…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా…
తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుకు దిగిందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కేశవరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని, తెలంగాణలో వచ్చే రబి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఆయన డిమాండ్…