ఏపీ మంత్రి పేర్నినాని కేసీఆర్ ఫ్లీనరీ సందర్భంగా మాట్లాడిన మాటలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని, రెండు రాష్ట్రాలలో పార్టీ ఎందుకు, దానికన్నా తెలంగాణ క్యాబినెట్‌లో రెండు రాష్ట్రాలను కలిపే తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగంగా మాట్లాడారు. కేసీఆర్‌కు ఏపీలో పార్టీ పెట్టాలని అంత కోరికగా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై మీడియా సమావేశంలో మంత్రి పేర్ని…
హుజురాబాద్ బై పోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ తెలుగు తల్లి ముందు మోకరిల్లిండన్నారు. తెలుగు తల్లిని బరితెగించి తిట్టిన కేసీఆర్ ప్లీనరీలో పెట్టిన స్వాగత తోరణంలో పెట్టింది తెలుగు తల్లినే అని అన్నారు. గులాబీ చీడకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు అందుకే తెలుగుతల్లి తోరణం పెట్టారన్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీగా ఎదగడానికి ఎందరినో…
టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ…
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా కొండాపూర్, ఆర్‌సీపురం, చందానగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పాటు హఫీజ్‌పేట, మియాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్…
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడాడు. టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలపై కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మంత్రి కేటీఆర్ ఈరోజు బరస్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తాజాగా జలవిహార్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్లీనరీ సమావేశంలో ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్న.. పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గా వస్తుంద’నే రీతిలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశాడు. టీఆర్ఎస్…