Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది. తన మెట్టి నిల్లు నిజామాబాద్ నుంచి జనం బాట ప్రారంభించబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్ వాయి టోల్ గేట్ దగ్గరకు చేరుకోనున్న కవిత.. బర్దిపూర్ నుంచి జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొననుంది. జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితుల తో సమావేశం కానున్నారు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కవిత సందర్శించనున్నారు.
Read Also: Telangana Govt: మున్సిపాలిటీలకు భారీ నజరానా.. రూ.2780 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
ఇక, సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు కవిత రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది. నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈరోజు ఉదయం 9గంటలకు గన్ పార్క్ లో నివాళులర్పించున్న కవిత.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుని జిల్లాల యాత్ర మొదలు పెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు. అయితే, కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యాత్రలో భాగంగా మేథావులు, విద్యావంతులను కలవాలని నిర్ణయించింది. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై జాగృతి అధ్యక్షురాలు చర్చించనుంది. అలాగే, ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసింది. జిల్లాల యాత్ర పూర్తి అయ్యేలోపు కవిత రాజకీయ పార్టీపై క్లారిటీ రానుంది.