Ponguleti Srinivas : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిస్వార్థంగా అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి అన్నారు.
రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వమని, అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం రైతుబంధు పథకం గురించి మోసగించి, ఎన్నికల ముందు అది కూడా ఇవ్వకుండా పరారైపోయిందని పొంగులేటి అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కేంద్రబిందువుగా తీసుకొని పాలన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. “మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలలోనే రూ. 8200 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేశాం,” అని చెప్పారు.
గత పాలనలో వరి వేస్తే ఉరి అన్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలకు సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. “ఆనాడు ఐదువేల రూపాయలు ఎకరాకు ఇచ్చిన రైతు బంధుకు ప్రత్యామ్నాయంగా, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కష్టమైనప్పటికీ రైతులకు వాగ్దానించిన విధంగా రూ. 6000 రైతు భరోసా ఇస్తున్నాం,” అని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్న పొంగులేటి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేవలం 90,000 ఇళ్లు కట్టిందని విమర్శించారు. “మన ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో మొత్తం 20 లక్షల ఇళ్లు పేదలకు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం,” అని హామీ ఇచ్చారు.
RCB vs DC: రాయల్ ఛాలెంజర్స్ కు హోమ్ గ్రౌండ్ కలిసొచ్చేనా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సిబి