తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “కన్నప్ప” ఒకటి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో, నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ సినిమాను రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో రఘుబాబు మాట్లాడుతూ “కన్నప్ప…