ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియాకు 'గేట్‌వే'గా మారడానికి సిద్ధంగా ఉందని ప్రధాని శనివారం అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బాబర్ ఆక్రమణను తొలగించి బీజేపీ రామమందిరాన్ని నిర్మించిందని బనమాలిపూర్‌లో జరిగిన బహిరంగ సభలో హిమంత బిస్వా శర్మ అన్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్‌ను బరిలోకి దింపింది.