తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Rahul Gandhi: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్‌గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గత 4 రోజులుగా లడఖ్‌లో పర్యటిస్తున్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించారు. ఆదివారం ఆయనకు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులు అర్పించిన రాహుల్ ‘‘మా నాన్న (రాజీవ్) చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు.…
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఘన నివాళులు ఆర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు.
నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వచ్చే సీజన్ ఐపీఎల్ లో ఆడతాడా.. లేదా అనే ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తుంది. అయితే తమ కెప్టెన్ కు భావోద్వేగమైన వీడియోను అంకితమిచింది సీఎస్కే యాజమాన్యం.
Yogi Vemana: యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.. అయితే, యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది… ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.. కాగా, వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు…
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా…
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు.…