Yogi Vemana: యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.. అయితే, యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది… ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.. కాగా, వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.. అంటే, ఆయన పద్యాలకు ఉన్న ప్రజాధరణ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు..
Read Also: Peddireddy Ramachandra Reddy: నా జీవితంలో ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు
1652 – 1730 మధ్య కాలంలో జీవించిన వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వ్యక్తి.. గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. సీపీ బ్రౌన్ చెప్పిన ప్రకారం ఇతన జంగమ కులానికి చెందిన శివకవి. మరో పరిశోధన ప్రకారం.. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని చెబుతుంటారు.. బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చారు వేమన.. అయితే, యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గతనెలలో జీవో నెంబర్ 164ను విడుదల చేసింది ప్రభుత్వం.. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ప్రజాకవి, తాత్వికవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. ఇక, ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా యోగి వేమ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు..