తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులు కన్నుమూసిన విషయం తెలిసింది. వారికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఘనంగా నివాళులు అర్పించింది. బాంబే రవి స్వరకల్పనలో వెలువడిన జయహో భారత్ అనే దేశభక్తి గీతాన్ని సైనిక అమర వీరులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది..…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వానికి తెరలేపింది.. మరోవైపు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. వ్యసాయ చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. ఆ బిల్లులను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. ఇవాళ వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం జరిగిపోయాయి.. ఇక, లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు ఆమోదంపై స్పందించారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… లోక్‌సభ ఆమోదించిన…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణాన్ని కన్నడ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరు పునీత్ ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్, హీరో శివ కార్తికేయన్ పునీత్ సమాధివద్ద నివాళులర్పించగా.. తాజాగా హీరో సూర్య పునీత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ సమాధి…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…
కోట్లాది తెలుగు వారి ఆరాధ్య దైవం , యావత్ ప్రపంచంలోనే మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక ఐకాన్ సీనియర్ ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేశారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి. అయితే ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని..తెలుగు ప్రజలకు…