రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నెహ్రూ 132వ జయంతి. నెహ్రూకు పిల్లలన్నా.. రోజా పూలన్నా చాలా ఇష్టం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలిపేందుకు… నెహ్రూ జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరపాలని తీర్మానించగా… అప్పటి నుంచి నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ…
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి…
ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, వారి మధ్య ప్రేమ విఫలమైనప్పుడు, ఒకరిపై మరొకరు విశ్వాసం కోల్పోయినప్పుడు లవ్‌లో బ్రేకప్ వస్తుంది. అయితే చాలా మందికి బ్రేకప్ నుంచి బయటపడటం అనేది నరకంగా ఉంటుంది. ఒక్కోసారి బ్రేకప్ అయిన వ్యక్తికి ఇంకా రిలేషన్ కొనసాగించాలని కొందరు భావిస్తారు. ఇంకా వారితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ వదిలేసి బయటకు రావాలి. అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్‌ఆర్‌ఏ పెరుగనుంది. ఐఆర్‌టీఆఎస్‌ఏ, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి…
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బ్రసెల్స్‌లో ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గూగుల్‌కు రూ.20,285 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశాన్ని, కొత్త ఆవిష్కరణలను నిరాకరించిందని, ముఖ్యంగా ఇది యూరోపియన్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ కంపెనీకి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో…
నల్గొండ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన విలియమ్స్ అనే వ్యక్తి ఓ చర్చిలో పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే అదునుగా చర్చికి వచ్చే మహిళలను అతడు టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానంటూ వారి వెంట పడేవాడు. ఆ తర్వాత మహిళలను లోబరుచుకుని పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు అతడు 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Read Also: పంజాగుట్ట పాప హత్య కేసులో…
కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బీడీ కాల్చారు. సోమవారం నాడు కమలాపురంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిపోతుండగా.. ఓ ఇంట్లో బీడీ తయారీ ప్రక్రియను చూసి మంత్రముగ్ధుడయ్యారు. దీంతో కార్మికుడు తయారుచేసిన బీడీ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. బీడీని అంటించుకుని స్టైలుగా పొగ వదలడంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప…
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో…