మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై…
ఫేస్‌బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్‌బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…
ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఓ లారీని చమురు ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని…
తెలంగాణలోని మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు ఈ నెల 10 నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన మద్యం షాపుల లాటరీ తీయనున్నట్లు ప్రకటించింది. అయితే గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్‌తో ముగిసింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు…
దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో…
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేళ కుటుంబంతో ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుదామని టపాసులు కొనుకొన్ని తన కుమారుడితో ఇంటికి వెళ్తుండగా ఉన్నంటుండి ఆ టపాసులు పేలడంతో ఆ తండ్రీకొడుకులు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పుదిచ్చేరికి చెందిన కలైనేషన్ (35) అనే వ్యక్తి విల్లుపురంలోని తన అత్తగారింట్లో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కలైనేషన్ తన కుమారుడు ప్రదేశ్ (7)తో…
యావత్తు ప్రపంచాన్నే కరోనా మహమ్మరి అతలాకుతలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్చినమయ్యాయి. కుటుంబ పెద్దలు కరోనా సోకి మరణించడంతో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారారు. ప్రపంచ విపత్తుగా కరోనా కాలాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనా నుంచి బయట పడేందుకు దేశాలు తమతమ శాస్త్రవేత్తలు కనుగొన్న కోవిడ్ టీకాలను ప్రజలకు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్ చికిత్స కోసం…
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి…
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్…
రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.