ఎన్ని రికార్డులకు కొలువైన తెలంగాణలో పుట్టిన ఓ కుర్రోడు తనకంటూ మరో రికార్డు క్రియేట్ చేశాడు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్) లో విద్యానభ్యసిస్తున్న పి. అశోక్ (17) అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రవేశ పరీక్షతో పాటు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూలో తన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణుడిగా నిలిచాడు. దీంతో నేషన్ డిఫెన్స్ అకాడమీక (ఎన్‌డీఏ)కు ఎంపికయ్యాడు. అంతేకాకుండా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైనా తొలి క్యాడెట్‌గా…
ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్‌లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్‌ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్గదర్శిని ఎంచుకుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు వినూత్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బాలింతలు రద్దీగా ఉండే బస్టాండ్‌లో పసిపిల్లలకు పాలిచ్చేందుకు అనుగుణంగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని…
భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నికకు దారితీసింది. హుజురాబాద్ లో మరోసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరవేసేందుకు కేసీఆర్ తన అనుచర గణాన్ని మొత్తం ఉపయోగించారనడంలో సందేహం లేదు. హుజురాబాద్ గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడించాలని గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ.. మంత్రి హరీశ్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు కేసీఆర్…
రోజురోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ కొట్టి నాటౌట్‌తో ఉన్న పెట్రోల్, డీజిల్ మరోసారి పరుగులు తీశాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 41 పైసల, లీటర్ డీజిల్‌పై 42పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 114.13 లకు చేరకుంది. దీనితో పాటు లీటర్ డీజిల్ ధర రూ. 107.40ల వద్ద ఉంది. ఇప్పటి వరకు రోజూ 30 పైసల మీద పెంచిన ఇంధన ధరలు.. ఒకేసారి…
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పించిన వీడియో కాల్ సదుపాయం రేపటి…
చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నేడు మృతిచెందారు. పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. శుక్రవారం ఆదాయంలో జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు. పునీత్ మరణానికి ఆయన చేసిన హెవీ వర్క్ అవుట్స్ యే కారణమా..? అంటే నిజమే…
ప్రపంచంలో అందరు ఒకేలా ఉండరు.. ఒకొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అందరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు.. ఇంకొంత మంది అందరిలా మనమెందుకు ఆలోచించాలని కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వారు ఫెయిల్ అవుతారు.. మరికొన్నిసార్లు అలాంటివారే ఇంకొంతమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి రెండో కోవకు చెందుతాడు అనే అనాలి. సాధారణంగా ఎవరైనా పోర్న్ సైట్ లో పాఠాలు చెప్తారని అనుకుంటారా..? అసలు ఆ ఆలోచన ఎవరికైనా వస్తుందా..?…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారికోసం గవర్నర్ తమిళసై ఓ అడుగు ముందుకువేసి నిరుపయోగంగా ఉన్న ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను, సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.…
దేశవ్యాప్తంగా రోజురోజుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి జాబితా పెరిగిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్‌ను చుట్టుకుంది. Read Also: ఖేల్…