మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో అందరినీ కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన మటుమాయం అవుతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆ వ్యక్తి కౌగిలించుకుంటే గంటకు ఇంత అని వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్…
ముద్దు అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎవరైనా ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దు పెడుతుంటారు. తల్లీ బిడ్డల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ముద్దు అనేది అన్యోన్యతను పెంచే సాధనం. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, వ్యక్తుల సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ప్రతి ఏడాది జూలై 6వ తేదీన అంతర్జాతీయ ముద్దు దినోత్సవం నిర్వహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం 2000లో…
టెక్నాలజీ రోజూ కొత్త పుంతలు తొక్కుతూ మానవుడి జీవినశైలిలో భాగమైపోయింది. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూనే ఉంది. టెక్నాలజీ రంగంలో అర్థమయ్యికానీ.. కొన్ని విషయాల్లో క్రిప్టో కరెన్సీ ఒకటి. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి కోట్ల ఘడించాలనుకొని బొక్కబోర్లా పడుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోసపోతున్నారు. అయితే అందులో భారతీయులు కూడా ఉన్నారు. అయితే నకిలీ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజీలు ద్వారా భారతీయ పెట్టుబడిదారులు సుమారు 128…
ట్రాఫిక్ పోలీసు విధులు అనుకున్నంత సులువు కాదన్నది జగమెరిగిన సత్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎండనక, వాననక విధులు నిర్వర్తిచాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ముందుకు వెళుతుంటారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిచడమే కాకుండా.. రోడ్డుపై అవస్థలు పడుతున్న వారికి సహాయం చేసిన ఘటనలు వైరల్ అయ్యాయి. అయితే.. అలాంటి సంఘటన…
యూపీఐ (UPI) అంటే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్. ఇది ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్‌లో ఏకీకృతం చేసి ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీ చేయడానికి అనుమతించే కేంద్రీకృత వ్యవస్థ. అయితే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఈ యూపీఐ లావాదేవీలపైనే ఆధారపడుతుండటంతో.. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ ద్వారా యూపీఐ మోసాలకు తెర లేపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో యూపీఐ మోసం ముప్పుగా మారింది. భారతదేశంలో యూపీఐ మోసం నుండి మిమ్మల్ని మీరు…
వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు మనం రంగును చూస్తాం.. కానీ అన్ని వాహనాలకు టైర్లు మాత్రం నల్లరంగులోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎంత ఖరీదైన వాహనం అయినప్పటికీ వాటి టైర్లు నల్ల రంగులోనే ఉంటాయి. అయితే టైర్లు నల్లరంగులోనే ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. దాదాపు 125 సంవత్సరాల క్రితం టైర్లు తెలుపు రంగులోనే తయారు చేయబడ్డాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు మిల్కీ వైట్‌గా ఉంటుంది. కానీ 1912 తర్వాతే…
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. అయితే.. కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాలో చనిపోకముందే సమాధి బుకింగ్ అనే ఓ కామెడీ సన్నివేశం గుర్తిండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో కామెడీనే.. కానీ ఇక్కడ రియల్.. సమాధిలో మనిషిని పూడ్చిన తరువాత.. ఆ సమాధికి బార్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాకుండా పూడ్చిపెట్టిన వ్యక్తి…
సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయాల్లో ప్రసాదం పేరిట పులిహోర లేదా కేసరి లేదా దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తుంటారు. కానీ ఏపీలోని అన్నవరం దేవస్ధానంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రసాదం మరెక్కడా దొరకదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో.. అన్నవరం ప్రసాదం కూడా అంతే ఆదరణ పొందింది. అన్నవరం ఆలయంలో గోధుమ…