మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో న్యుమోనియా చికిత్స కోసం వేడి రాడ్‌లతో చేసే చికిత్స ప్రాణాంతకంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో న్యుమోనియాతో బాధపడుతున్న 3 నెలల బాలిక చికిత్స కోసం వేడి రాడ్‌తో 51 సార్లు కొట్టినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
ఆపదలో ఉన్నాం.. ఆదుకొండి అంటూ వస్తే తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి.. వైద్యం చేయించుకోవడం కష్టమైన వారికి భరోసా ఇచ్చారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ విషయానికి ఆయన భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు…
Be Ready with B Better: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్‌నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు…
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్‌లో చోటుచేసుకుంది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. దానికి చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఇదే సమయంలో మరికొన్ని ఔషధాలకు కూడా ఆమోదం తెలింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)… కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి తాజాగా మరో రెండు ఔషధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో…
ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది.…