Acid Attack: బైక్ పై వెళ్తున్న మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళపై యువకుడు యాసిడ్ పోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సోనిత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సుశాంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళ పని ముగించుకుని తన స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ధేకియాజులిలో ఈ ఘటన జరిగింది. ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మహిళను నిందితుడు అడ్డగించాడు. వీరి మధ్య డబ్బు విషయమై కొంత కాలంగా విభేదాలు తలెత్తుతున్నాయి. వివాహితుడైన నిందితుడు అవివాహితైన సదరు మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తలెత్తిన వివాదంలో నిందితుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ దాడిలో మహిళకు 15 శాతం గాయాలయ్యాయి. ఆమె మెడ, తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి. నిందితుడు వత్సుకర్ అనే వ్యాపారిగా గుర్తించాం. అతన్ని సోమవారం అరెస్టు చేసి ధర్యాప్తు చేపట్టినట్టు బిస్వా శర్మ తెలిపారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!