Knee Pain : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఈ మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు. కండరాలు బిగుసుకుపోవడం, కీళ్ల నొప్పులు కొంతమందికి రాత్రంతా ఇబ్బంది కలిగిస్తాయి. కానీ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఈ సమస్య భవిష్యత్తులో నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ముందుగా దాని కారణాలు, నివారణలను తెలుసుకోండి.
పురుషుల కంటే స్త్రీలు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. స్త్రీల శరీరతత్వం నిర్దిష్టంగా ఉంటుంది. సాధారణంగా వారు రోజువారి పనుల్లో ఎక్కువగా నడుస్తుంటారు. ఇది వారి మోకాళ్ల కదలికను కూడా పెంచుతుంది. ఇది నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ బహిష్టు సమయంలో.. మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల కీళ్లకు మద్దతు ఇచ్చే మృదులాస్థిపై కూడా ప్రభావం చూపుతుంది.
Read Also: Bandi Sanjay: సిట్ నోటీస్ లు నాకు అందలేదు.. ఏ ఇంటికి అంటించారో తెలియదు
పురుషుల కంటే స్త్రీలు స్థూలకాయానికి ఎక్కువగా గురవుతారు. ఇది మోకాళ్లపై ఒత్తిడి తెచ్చి వాటిని దెబ్బతీస్తుంది. బరువు పెరగడం వల్ల మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మీ బరువు కంటే ఐదు రెట్లు ఎక్కువ. అంటే, మీ బరువు సాధారణ పరిధి కంటే 5 కిలోలు ఎక్కువగా ఉంటే.. మీ మోకాళ్లపై ఒత్తిడి 25 కిలోలు ఎక్కువగా ఉంటుంది. నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. మోకాలు నిరంతరం బాధాకరంగా ఉంటే.. వాపు లేదా వంగడం కష్టంగా ఉంటే విస్మరించవద్దు. వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందండి.
మోకాలిపై గాయం ఉంటే వెంటనే చికిత్స చేయాలి. సకాలంలో చికిత్స చేయకపోతే.. భవిష్యత్తులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అవసరానికి మించి వ్యాయామం చేయడం కూడా మోకాళ్లకు హానికరం. మితిమీరిన వ్యాయామం, పరుగు మోకా చిప్ప పై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా అది దెబ్బతినే అవకాశం ఉంది.
Read Also : Viral : తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు.. మృతదేహం ఎదురుగా లవర్ తో పెళ్లి
మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. అధిక శరీర బరువు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని తొలగించుకోవాలి. అందులో భాగంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. మోకాలి మృదులాస్థిని రక్షించడంలో స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో గాయాల నుండి కూడా రక్షిస్తుంది. జుంబా, ఫంక్షనల్ వర్కౌట్, సూర్య నమస్కార్, యోగా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన ఉత్సాహం కూడా నొప్పికి కారణం కావచ్చు. మీకు నొప్పి, మోకాలి వాపు అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.