Be Ready with BBETTER: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్‌నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు ఇప్పటికీ ఫిట్‌నెస్‌తో ఉంటారు. అదే ఇప్పుడైతే వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరికీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తోంది. అందులో ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల గురించి చెప్పుకోవాలి.
బాల్యాన్నీ వదలని..
ప్రస్తుతం.. పిల్లలు పుట్టిన దగ్గరి నుంచే పుస్తకాల భారాన్ని మోస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ లెవల్లోనే కేజీల కొద్ది బరువైన బుక్స్, వయసుకు మించిన బరువుండే స్కూల్ బ్యాగ్స్‌తో కుస్తీలు పడుతున్నారు. 3, 4 అంతస్తుల ఎత్తులోని క్లాస్ రూమ్‌లకు మెట్లెక్కి వెళుతున్నారు. మెట్లు దిగుతూనే కిందికి వస్తున్నారు. భవిష్యత్తులో తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇలా బాల్యం నుంచే మోకాళ్లపై ఎక్కువ ఆధారపడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే జాయింట్ పెయిన్స్ బారిన పడుతున్నారు. మరికొందరు.. స్థూలకాయం వల్ల మోకాళ్ల నొప్పులకు గురవుతున్నారు.
ఇల్లైనా.. ఆఫీసైనా..
ఇళ్లల్లో అమ్మలు, అమ్మమ్మలు, అత్తమ్మలు, వదినమ్మలు, అక్కాచెల్లెళ్లు నిత్యం కూరగాయలు తరిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, టీవీ చూసేటప్పుడు.. దాదాపు ప్రతి సందర్భంలోనూ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ సరిగా లేకపోవటంతో నడుం నొప్పులు, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ల తీపులు పెరుగుతున్నాయి. అలాగే.. సాఫ్ట్‌వేర్, డెస్క్‌టాప్, ఆఫీస్ వర్క్స్, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులు అదే పనిగా గంటల తరబడి నిలబడి లేదా కుర్చీల్లో కూర్చొని ఉండటం వల్ల వెన్నుపూస పైన, మణికట్టు పైన ఒత్తిడి ఎక్కువై బ్యాక్ పెయిన్ బాధితులుగా మారుతున్నారు.
గతి తప్పిన ప్రయాణం
పట్టణాల నుంచి పల్లెవాసుల వరకు ఇదే విధంగా ఒకే భంగిమలో పని చేస్తుండటంతో ఈ సమస్య బారినపడుతున్నారు. డ్రైవింగ్ అనేది కేవలం లారీ, కార్ డ్రైవర్లకే సంబంధించింది కాదు. నేడు అది అందరి నిత్య జీవితాల్లో ఒక భాగమైంది. దీంతో వీళ్లదీ అదే సమస్య. కిలోమీటర్ల దూరం కూర్చొని డ్రైవింగ్ చేస్తుండటం, కాళ్లతో పదే పదే బ్రేక్‌లు తొక్కడం, చేతులతో స్టీరింగ్ తిప్పడం కారణంగా మోకీళ్లు, మోచేతులు గుంజుతుంటాయి. సిటీల్లో రోజూ ఆఫీసులకు బైక్‌ల మీద వెళ్లివచ్చేవారికి కూడా ఒళ్లు హూనమవుతోంది. అడుగడుగునా గుంతలమయమైన రోడ్లపై పర్లాంగుకో స్పీడ్ బ్రేకర్లు ఉండటం వల్ల ప్రతి నిమిషం బ్రేకులు వేయాల్సిన పరిస్థితి.
అసలు సమస్యకు మూలం
దీని వల్ల బాడీ షేక్ అవటం మూలంగా శరీరంలోని ప్రతి కీలూ ముఖ్యంగా మణికట్టు, మోకాలు, నడుం భాగం ఒత్తిడికి గురవుతోంది. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కీళ్లలోని జిగురు పదార్థం లేకపోవటం మరింత ప్రమాదకరం. అది చివరికి ఎముకల అరుగుదలకు దారితీసి, సర్జరీ వరకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులను నివారించాలంటే ‘బీ బెటర్’ (BBETTER) సప్లిమెంట్స్ వాడటం వల్ల జిగురు పదార్థాన్ని తగు స్థాయిలో ఉంచుతూ కీళ్ల ఆరోగ్యాన్ని సదా రక్షిస్తూ ఉంటుంది.
సాఫీగా సాగాల్సిన వృద్ధాప్యం
వయసు మీద పడ్డవాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోకాళ్లు అరిగిపోవటం వల్ల నాలుగడుగులు వేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కొద్దిసేపు కూర్చున్నా, నిలుచున్నా, నడిచినా కాళ్లు పట్టేస్తాయి. లాగుతుంటాయి. వాళ్లను జాయింట్ పెయిన్స్ తిన్నగా ఉండనీయవు. ఈ నేపథ్యంలో.. ఫిట్‌నెస్ కోసం రకరకాల మందులు వాడుతుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఫిజియోథెరపీ సెషన్లకు గంటల తరబడి హాజరవుతుంటారు. ఓల్డేజ్‌ని తలచుకొని.. ఓ.. బాధపడుతుంటారు.
Be Ready with BBETTER
పొడుస్తున్న పొద్దు, కదిలే కాలంతోపాటు మనమూ పోటీపడాలంటే, మన (మో)కాళ్లపై మనం హ్యాపీగా ముందుకు సాగాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇందులో ‘‘జాయింట్ హెల్త్’’ మరీ ప్రధానం. మోకాళ్లు, మోకీళ్లు ఫ్యూచర్ రెడీగా ఉండాలంటే సరైన ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ వంటివి కీలకం. పోషకాహారం కూడా విశేష పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటివారి కోసం మాంక్‌సేస్ సూపర్‌ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే హల్త్ కేర్ సంస్థ ‘‘బీ బెటర్’’ బ్రాండ్ నేమ్‌తో జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్‌ని మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంచింది.
రోగాన్ని బట్టి రెమెడీ
మోకీళ్ల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. పైనుంచి వచ్చే తొడ ఎముక, కింది నుంచి వచ్చే కాలి ఎముక, మధ్యలో మృదులాస్థి(కార్టిలేజ్), జిగురు పదార్థం ఉంటాయి. ఇవి మనం మోకాలును ఆడించినప్పుడు ఎముకలు రాసుకుపోకుండా, సున్నితంగా కదిలేలా చేస్తాయి. మందంగా, బలంగా ఉండే కార్టిలేజ్.. వయసు మీద పడుతున్నకొద్దీ క్రమంగా అరగటం ప్రారంభమవుతుంది. మృదులాస్థిలో నీటి శాతం తగ్గిపోవటం, ఎండిపోవటంతోపాటు ఇతర కారణాల వల్ల సైతం ఇలా జరుగుతుంది.
మృదులాస్థి ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ మామూలు స్థితికి రావటం అసాధ్యం. ఉన్నదాన్ని కాపాడుకోవటం తప్ప మరేమీ చేయలేం. కార్టిలేజ్ ఆరోగ్యం కోసం గ్లూకోజమైన్ సప్లిమెంట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి కార్టిలేజ్‌కి బలాన్నిస్తూ మరింత డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. గ్లూకోజమైన్ మన శరీరంలో సహజంగా ఉత్పత్తవుతుంది. వయసు పెరుగుతుంటే తగ్గిపోతుంది. ఆ లోటును తీర్చటానికే గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే గ్లూకోజమైన్ సప్లిమెంట్స్‌లో ఎక్కువ శాతం నాన్ వెజ్ రకానికి చెందినవే ఉన్నాయి.
ప్యూర్ వెజిటేరియన్ సప్లిమెంట్
బీ బెటర్ బ్రాండ్ జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ మాత్రం ప్యూర్ వెజిటేరియన్. వీటిలో.. అల్లం, పసుపు, గులాబీ, దాల్చిన చెక్క తదితర ఔషధ గుణాలు కలిగిన అదనపు పదార్థాలు ఉన్నాయి. ఈ సప్లిమెంట్స్‌ని మూడు నెలల పాటు రోజుకు రెండు చొప్పున వాడితే సరిపోతుంది. ఉదయం టిఫిన్‌కి, రాత్రి డిన్నర్‌కి అర్ధ గంట ముందు వేసుకుంటే చాలు. లైఫ్ లాంగ్ ధీమాగా నడవొచ్చు. ఈ మేరకు ఎంతో మంది పేషెంట్లు, కస్టమర్లు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కుటుంబంలోని వివిధ వయసులవారు ఈ ప్రొడక్టులను సురక్షితంగా వాడుతున్నారు.
యంగర్ ఏజ్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతిఒక్కరూ స్ట్రాంగర్ జాయింట్స్ కోసం, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఈ సప్లిమెంట్స్‌నే సెలక్ట్ చేసుకుంటూ ఉండటంతో ‘‘బీ బెటర్’’ బ్రాండ్ బాగా పాపులర్ అయింది. వయసు పెరిగితే మోకీళ్ల సమస్యలు వచ్చి తీరతాయనే భయం చాలా మందిలో ఉంది. కానీ.. అది సరికాదు. సాధ్యమైనంత చిన్న వయసు నుంచే ముందుచూపుతో జాయింట్ హెల్త్ ప్లాన్ ఫాలో అయితే సరిపోతుంది. ఇందులో భాగంగా నిత్యం మితంగా వ్యాయామం చేయాలి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. సరైన పోషకాహారంతో మోకాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి.
ప్రివెన్షన్ ఈజ్ (బి) బెటర్ ద్యాన్ క్యూర్
జీరో సైడ్ ఎఫెక్ట్స్ గల బీ బెటర్ బ్రాండ్ ఉత్పత్తులను కాకుండా జంతు సంబంధమైన సరుకులతో చేసే సంప్రదాయ గ్లూకోజమైన్ ఉత్పత్తులు కొందరిలో అలర్జీకి దారితీస్తుంటాయి. ఆస్తమా పేషెంట్లలో అయితే ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి.. వెజిటేరియన్ గ్లూకోజమైన్ ప్రొడక్ట్‌లే సురక్షితమని, ఆరోగ్యకరమని, నాన్ వెజ్ సప్లిమెంట్స్ మాదిరిగానే పనిచేస్తాయనటంలో ఎలాంటి సందేహంలేదు. సీఫుడ్ అలర్జీ ఉన్నవాళ్లకు ఈ ప్రొడక్టులు వంద శాతం సూటబుల్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆరోగ్య సమస్య ఏదైనా కావొచ్చు. దాన్ని నయం చేయటం కంటే నివారించటం ముఖ్యం. Prevention is (B)BETTER than Cure.
సంప్రదించాల్సిన అడ్రస్
Monksays Superfoods [P] Ltd.
Ph: 9392636863
Care@monksays.co
W: www.bbetter.co