Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు. డయేరియా-ప్రేరేపిత రోటా వైరస్ మాదిరిగానే ఉన్న ఈ వైరస్ సోకిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నోరా వైరస్ ప్రభలకుండా పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు సెలవు ప్రకటించారు. నోరా వైరస్ సోకిన వ్యక్తి నుండి ఇతరులకు వ్యాపిస్తుంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది.
Read Also: Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి
నోరోవైరస్ అంటే ఏమిటి?
నోరో అనేది కడుపు ఫ్లూకి కారణమయ్యే వైరస్ల సమూహం. వైరస్ కడుపు, ప్రేగులపై దాడి చేస్తోంది. తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. నోరోవైరస్ సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో స్వల్పంగా ఉన్నప్పటికీ, ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సోకినట్లయితే అది తీవ్రంగా ఉంటుంది. మూసివేసిన ప్రదేశాలలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రెండు రోజుల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు మొదలవుతాయి. మైకము, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కూడా నోరోవైరస్ సంక్రమణతో పాటుగా ఉంటాయి.
Read Also: Honda Activa H-Smart: మార్కెట్లోకి హోండా యాక్టివా హెచ్-స్మార్ట్..ఫీచర్స్ అదుర్స్
ఈ అంటువ్యాధి వైరస్ కలుషితమైన నీరు, ఆహారం, ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తికి అనేకసార్లు ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అనారోగ్యం సాధారణంగా రెండు లేదా మూడు రోజులు ఉంటుంది. తగినంత నీరు త్రాగటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత.. మీ పిల్లల డైపర్‌ని మార్చిన తర్వాత సబ్బు, నీటితో మీ చేతులను బాగా కడగాలి. తినే ముందు చేతులు కడుక్కోవాలి. వ్యాప్తి సమయంలో ఉపరితలాలను హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమిసంహారక చేయాలి. RT PCR పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌లు కనుగొనబడలేదు. వైరస్‌తో పోరాడడంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం కీలకం.