తెలిసింది గోరంత… తెలయంది కొండంత.. అంతకంటే ఇంకా ఎక్కవే… అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. రష్యా వ్యోమగామి యూరిగగారిన్ ఎప్పుడేతే అంతరిక్షంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి మరింత ఆసక్తి నెలకొన్నది. పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంటరయ్యాక ఒక్కసారిగా పోటీ మొదలైంది. వర్జిన్ గెలక్టిక్, బ్లూఆరిజిన్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధన మొత్తం అంతరిక్ష యాత్ర చుట్టూనే జరుగుతున్నాయి.…
నీరు ప్రజలకు జీవనాధారం. నీరు లేకుండా మనిషి మనుగడ సాగించడం చాలా కష్టం. చాలా ప్రాంతాల్లో మనిషి వర్షం నీటిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాడు. భూమిపై ఏదో ఒక సమయంలో తప్పని సరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. కానీ, భూమిపై ఉన్న ఆ గ్రామంలో ఇప్పటి వరకు వర్షం చుక్కకూడా కురవలేదట. దీనికి కారణం లేకపోలేదు. ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉన్నది. Read:…
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండటంతో వివిధ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. తాజాగా గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేదం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా…
ప్రయాణికుల కోసం ఈయూ గ్రీన్ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వివిధ దేశాల ప్రయాణికులు ఈయూదేశాల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి నేసథ్యంలో టీకా తీసుకున్న వారికి ఈ విధానం వర్తిస్తుంది. అయితే, నాలుగు రకాల టీకాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ గ్రీన్ పాస్‌లు వర్తిస్తాయని మొదట పేర్కొన్నది. మోడెర్నా, ఫైజర్, అస్త్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గ్రీన్ పాస్ లు ఇస్తామని తెలిపింది. …
దేశం సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను దాదాపుగా ఎత్తివేశారు. సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం నుంచి రవాణా వ్యవస్థను పునరుద్దరించారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తమిళనాడులోని 27 జిల్లాల్లో 19,920 బస్సలు రోడ్డెక్కాయి. దీంతో తమిళనాడులో ఒక్కరోజులో 22…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. మాల్స్ తో సహా అన్ని ఒపెన్ అయ్యాయి. 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల తరువాత మెట్రో ప్రారంభం కావడంతో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కళకళలాడాయి. మొదటిరోజున 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది. ఇక మెట్రోలో నిలబడి ప్రయాణం…
భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకు మొత్తం 48 మందికి భారత రత్న అవార్డులు పొందగా, ఇందులో 14 మందికి మరణానంతరం ఈ అవార్డులు పోందారు. భారత రత్న అవార్డులు పొందిన వారిలో అమర్త్య సేన్ కూడా ఒకరు. ఈ పురస్కారం పోందిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉచిత ప్రయాణం వినియోగించుకున్న వారిలో అమార్త్యసేన్ ముందు వరసలో ఉన్నారు. ఆయన…
ఇండియాలో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది. దీంతో ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది. ఇండియా నుంచి పోలెండ్‌కు వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని పోలెండ్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే పోలెండ్ దౌత్యవేత్తల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్‌కు చేరుకుంది. పోలెండ్‌కు చేరుకున్న దౌత్యవేత్తల కుటుంబానికి…