కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. మాల్స్ తో సహా అన్ని ఒపెన్ అయ్యాయి. 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రో ప్రారంభం అయింది. 28 రోజుల తరువాత మెట్రో ప్రారంభం కావడంతో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు కళకళలాడాయి. మొదటిరోజున 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది. ఇక మెట్రోలో నిలబడి ప్రయాణం చేస్తున్న 84 మందిని దించేసినట్టుగా మెట్రో అధికారులు పేర్కొన్నారు. మెట్రోలో తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.