Warangal: వరంగల్ జిల్లాలో రవాణాశాఖలోని ఆర్టీఓ గంధం లక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, ఆర్టీఓ గంధం లక్ష్మితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సమయంలో రవాణా శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ఆర్టీఓ లక్ష్మిని ప్రశ్నించారు. అయితే, అడిగిన ప్రశ్నలకు ఆర్టీఓ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం కలెక్టర్ ఆగ్రహానికి గురైంది. విధుల్లో నిర్లక్ష్యం వహించడం సరైన పని కాదని అన్నారు.
Also Read: DaakuMaharaaj : కింగ్ ఆఫ్ జంగిల్ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్
దీనితో, ఆర్టీఓ గంధం లక్ష్మికి విధుల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం పట్ల శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందులో ఏడు రోజుల్లోపు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ, రోడ్డు భద్రత మాసోత్సవాల్లో రవాణా శాఖ కీలక పాత్ర పోషించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఆర్టీఓ లక్ష్మి నిర్లక్ష్యవైఖరితో వ్యవహరించడం అనేది సరైనది కాదని వ్యాఖ్యానించారు. రవాణా శాఖలో విధుల్లో నిర్లక్ష్యం చూపడం వల్ల ఆర్టీఓ గంధం లక్ష్మి నోటీసులకు గురవడం, సంబంధిత కార్యక్రమాల అమలులో మెరుగుదల అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సర్కారు మరింత సీరియస్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
Also Read: Sydney Test: భారత్ ఘోర ఓటమి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆసీస్