నగరాల ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం సులువు అయిపోయింది.. దూరంతో సంబంధం లేకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.. అయితే.. బెంగళూరులో మెట్రో రైలు సేవలు మరింత తొందరగా ప్రారంభం కానున్నాయి.. మరింత లేట్ నైట్ వరకు సాగనున్నాయి.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతోన్న మెట్రో రైలు సేవలు.. శనివారం నుంచి గంట ముందుగానే.. అంటే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)… ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం..
అయితే, బెంగళూరు మొత్తం ఈ సమయానికి సేవలు ప్రారంభం అవుతాయి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నాగసంద్ర, సిల్కుబోర్డు, కింగేరి, బయ్యప్పనహళ్లి స్టేషన్‌ల నుంచి తొలి మెట్రో రైలు ఉదయం 5 గంటలకు ప్రారంభం కాబోతోంది.. ఇక, ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు పరుగులు పెడుతుండగా.. ఇకపై కెంపెగౌడ రైల్వేస్టేషన్ నుంచి మాత్రం చివరి రైలు సర్వీసు రాత్రి 11.30 గంటలకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.. అయితే, ఆదివారం మాత్రం మెట్రో రైలు సేవలు ఉదయం 7 గంటల నుంచే యథావిథిగా ప్రారంభం అవుతాయని.. అందులో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని బీఎంఆర్‌సీఎల్ ప్రకటించింది.