ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. దీంతో విద్యుత్ వినియోగానికి భారీగా డిమాండ్ పెరిగింది.. కానీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాను అందించే పరిస్థితి లేకుండా పోయింది.. అది కాస్తా విద్యుత్ కోతలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది.. దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రైలు సర్వీసులను రద్దు చేసింది రైల్వేశాఖ… మొత్తంగా 1100 ప్రయాణికుల రైళ్ల ట్రిప్పులను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.. ఇప్పటికే 650 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్న రైల్వే శాఖ.. ఇప్పుడు మరిన్ని ట్రిప్పులను రద్దు చేసినట్లుగా సమాచారం. విద్యుత్ కోతలు లేకుండా.. విద్యుత్ డిమాండ్ తగ్గేవరకు పరిస్థితి ఎలాగే ఉంటుందని తెలుస్తోంది.
Read Also: TDP: వివాదంలో మంత్రి రోజా భర్త.. క్షమాపణకు డిమాండ్..!
కాగా, దేశవ్యాప్తంగా 173 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 108 కేంద్రాలను బొగ్గు కొరత వెంటాడుతున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి.. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో పలు రైల్వే జోన్లలో ప్రయాణికుల రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, విద్యుత్ కొరత నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడం, ఆ తర్వాత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రధాన్యత ఏర్పడింది.. కాగా, వడగాల్పుల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాలు ఆల్-టైమ్ హై ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. గత వారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఢిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ సోమవారం 6,194 మెగావాట్లకు పెరిగింది, ఇక, ఏప్రిల్‌లో తొలిసారిగా విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్ల మార్కును దాటింది. దీంతో, విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపును సులభతరం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ మే 24 వరకు దాదాపు 1,100 ట్రిప్పులను రద్దు చేసింది. బొగ్గు కొరతను తగ్గించడానికి, దాదాపు 500 ఎక్స్‌ప్రెస్ మెయిల్స్ మరియు 580 ప్యాసింజర్ రైళ్ల ట్రిప్పులు కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది.