1850 దశకంలో రైళ్లు దేశంలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల గురించి మనందరికీ తెలుసు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. రైళ్లలో గేర్లు ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. రైళ్లలో చాలా గేర్లు ఉంటాయి. ఈ గేర్లను నాచ్ అని అంటారు. ఇంజన్‌లో మొత్తం 8 నాచ్‌లు ఉంటాయి. ఎనిమిదో నాచ్‌లో సుమారు 100 కిమీ వేగంతో ప్రయాణం చేస్తాయి. ఒకసారి ఫిక్స్ చేస్తే మళ్లీ వాటిని రిప్లేస్ చేయాల్సి ఉండదు. రైలు వేగం తగ్గించాలి అనుకున్నప్పుడు నాచ్‌ను తగ్గిస్తారు. దీంతో రైళ్లు స్పీడ్ నియంత్రణలోకి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు రైళ్లు పెద్ద ఎత్తున వేగంతో ప్రయాణం చేసే విధంగా మార్పులు చేస్తున్నారు. త్వరలోనే దేశంలో బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read: మతపెద్దల సంచలన నిర్ణయం: పెళ్లిళ్లలో ఒకే కూర… ఒకటే స్వీట్…