ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్‌ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
భారత్‌తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్‌లో ఒక ప్రకటన చేశారు.
Import Ban: పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతికి ప్రభుత్వం లైసెన్స్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు ఇతర ఉత్పత్తులపై కన్నేసింది. రాబోయే రోజుల్లో కెమెరా, ప్రింటర్, హార్డ్ డిస్క్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్ వంటి పరికరాలపై కూడా కౌంటర్ పరిమితులు విధించవచ్చు.
Rotten Coconut Business: డబ్బు ఎలా సంపాదించాలని చాలా మంది ఉన్న పనిని వదులుకుని టైం వేస్టు చేస్తూ అదేపనిగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ టైంలో కొంచెం బుర్రకు పదును పెడితే కోట్టు సంపాదించే మార్గాలెన్నో ఉన్నాయి.
తాలిబన్ లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో బలమైన సంబందాలు ఉన్నాయని, అక్కడ పెట్టిన పెట్టుబడులే అందుకు నిదర్శనం అని తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అయితే, తాలిబన్లు ఎలా పరిపానల చేస్తారు, ప్రపంచ దేశాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్‌తో వాణిజ్యంపై ఇప్పటికే తాలిబన్లు…