సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. 11వ తేదీ నుండి హుజూరాబాద్ లో 7 సభలు. మండల కేంద్రాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేసారు. ఈటల మీద విచారణ జరిపిన నివేదికలు ఏమయ్యాయి అని ప్రశ్నించిన ఆయన ఈటల బీజేపీ లో చేరడానికి కేసీఆర్ కారణం అని పేర్కొన్నారు. ఈటల బీజేపీ లో చేరిన వెంటనే విచారణలు ఎందుకు ఆగిపోయాయి. హుజురాబాద్ నియోజక వర్గ అభ్యర్థిత్వం…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…
పంతం నీదా..నాదా అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ. చూస్తుండగానే పెద్ద సవాల్‌గా మారిందీ సమస్య. సభ నిర్వహిస్తామని ఒకరు.. వద్దని ఇంకొకరు భీష్మించడంతో పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు ఆధిపత్యానికి పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రేవంత్, మహేశ్వర్‌రెడ్డిల మధ్య ఇంద్రవెల్లి సభ చిచ్చు! దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోరాకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా నాయకుల మధ్య పంచాయితీ.. ఏకంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో…
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె…
తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి…
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం నాయకులు ఎక్కువైతే.. పదవులు పెరుగుతాయి. ఉన్నవాళ్లకు పని లేకపోయినా.. పదవుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం ఆ పార్టీ స్పెషల్. ఇప్పుడు ఓ పదవికి ఇంకా డిమాండ్ పెరిగింది. అలకపాన్పు ఎక్కిన నేతలు సైతం ఆ పోస్టే అడుగుతున్నారట. ఇంతకీ ఆ పదవికి ఉన్న క్రేజ్ ఏంటి? అలకలో ఉన్న కాంగ్రెస్ నేతలు… ఆ పదవే కోరుతున్నారా? తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించినప్పుడు మొదలైన నేతల అలకలు…
తెలంగాణ పీసీసీ చీఫ్‌తో పాటు ఇతర కమిటీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. అయితే, ఆ కమిటీలపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోను అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఈ మధ్యే డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.. ఇక, చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో తనను కలవడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. బడుగు బలహీన…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. ఆయన కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది.. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో…