తెలంగాణలో సుదీర్ఘ కసరత్తు తర్వాత పీసీసీ కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ.. దీనిపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నా.. కొత్తగా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఈ లోపుగానే గాంధీ భవన్‌లో వాస్తు మార్పులు జరగాలని నిర్ణయించారు.. దీంతో.. రంగ ప్రవేశం చేసిన వాస్తు నిపుణులు, వేదపండితులు.. గాంధీ భవన్‌ను పరిశీలించి కొన్ని మార్పులు చేసినట్టుగా చెబుతున్నారు.. గాంధీభవన్‌లో ఎంట్రీ పాయింట్‌ను కొత్త కమిటీ నేతలు మార్చాలని నిర్ణయానికి…
టీపీసీసీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఏ ఒక్క నేత చెబితే రాలేదని.. కార్యకర్తలు, పబ్లిక్ పల్స్ తెలుసుకొని.. సోనియా గాంధీ పీసీసీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే రేవంత్ కు పీసీసీ ఇచ్చారని వెల్లడించారు. పీసీసీ వస్తుందని తెలిసి.. దళిత సాధికారత అని సీఎం కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని సీతక్క మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్…
పీసీసీ పదవుల పందేరంలో ఆ జిల్లా నేతలకు ఎందుకంత ప్రాధాన్యం లభించింది? గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయినప్పటికీ వారికి కలిసొచ్చిన సమీకరణాలేంటి? ఇప్పటికైనా యాక్టివ్‌గా పనిచేస్తారా? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల…
తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు. రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడని… అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడని చంద్రబాబు చురకలు అంటించారు. టీపీసీసీని… ఇక తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో అని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు…
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క వన దేవతలను దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటు అయిదుగురు కార్యనిర్వాహక…
కాంగ్రెస్ పార్టీ గరక లాంటిది.. ఎండకు ఎండినా… చిన్న చినుకు పడితే పచ్చగా చిగురిస్తుందని కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కొత్త పిసిసి టీం సభ్యుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్రలో నాలుగు నెలలకు పైగా అభిప్రాయ సేకరణ చేసి పిసిసి నియామకం చేయడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. నేను సోనియా గాంధీ మనిషి అని… చిన్న వయసులో.. తక్కువ సమయంలో నాకు పెద్ద…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి…
తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మునగడం ఖాయమని.. అందులో అసలు అనుమానమే లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే.. అదే మాట్లాడతారని మండిపడ్డ ఆయన..రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని వెల్లడించారు. read also : మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. దళితజాతి వ్యతిరేక పార్టీ…
కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంకి కృషి చేస్తా అన్నారు. బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయి కి వచ్చా. 2004 నుండి… పార్టీ లో కీలకంగా పని చేశా . తెలంగాణ కోసం కొట్లడింది మేమే. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వండి అర…