ఇంద్రవెల్లిలో జరిగేది ఆత్మగౌరవ సభ.. కేసీఆర్‌ను గద్దెదించే వరకు పోరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె గుర్తుచేశారు.
ఇక, దళిత బంధు కొత్తదేమీ కాదున్నారు ఎమ్మెల్యే సీతక్క.. దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల ఇవ్వకుండా ఇది ఇస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని విమర్శించిన ఆమె… సీఎం కేసీఆర్ పథకాల ప్రకటన తప్పా… అమలు చేసేది లేదంటూ ఎద్దేవా చేశారు.. ఇంద్రవెల్లిలో ఈ నెల 9వ తేదీన జరిగేది ఆత్మ గౌరవ సభ అని.. ఇక్కడి నుంచే ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ ను గద్దెదించే వరకూ పోరాటం చేస్తామని వెల్లడించారు సీతక్క.
Also Read
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!