హుస్సేన్ సాగర్‌లో భాగమతి బోటులో ప్రయాణించేందుకు పర్యటకులు ఇష్టపడతారు. అయితే, ఆదే ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షం కరిసిన సంగతి తెలిసిందే. భాగమతి బోటులో 40 మంది పర్యాటకులు ఉరుములు, ఈదురు గాలులకు చిక్కుకోవడంతో హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అప్రమత్తమైన బోట్ల సిబ్బంది అందరినీ విజయవంతంగా రక్షించి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Also Read:Vande Bharat : కేరళలో ట్రైన్ రాజకీయం.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఎంపీ పోస్టర్లు
ప్రఖ్యాతి గాంచిన భాగమతి బోటు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బుద్ధ విగ్రహం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈదురు గాలులతో కూడిన భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా పడవ అదుపు తప్పి మరో దిశలో కొట్టుకుపోవడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి అంచనా వేసిని సిబ్బంది వేగంగా పడవను ఒడ్డుకు చేర్చారు. వాతావరణం కారణంగా బోటు ఒక్కసారిగా పనిచేయడం మానేసింది. అయితే, పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు.