న్యూఇయర్ రోజు విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఒంగి తనకు నమస్కారం పెట్టడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది పెద్ద చిన్నా తారతమ్య సంస్కారానికి సబంధించిన అంశం అన్నారు. ఆయనేమీ నాకు సాష్టాంగం చేయలేదు, కాళ్లు పట్టుకోలేదు. వయసులో 20 ఏళ్ల పెద్ద వాళ్ళు కనిపించినపుడు వంగి నమస్కరించడం మన సంప్రదాయం అన్నారు బొత్స. సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే…
ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి…